ETV Bharat / city

ప్రత్యక్ష పోరుకు తెదేపా సిద్ధం...నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు - statewide dharna

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా ప్రత్యక్షపోరు చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇసుక కొరతతో వివిధ రంగాలపై పడిన ప్రభావాన్ని నిరసిస్తూ ఇవాళ తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించనున్నారు. వైకాపా వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇకపై ప్రతివారంలో 2 రోజులు జిల్లాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.

ప్రత్యక్ష పోరుకు తెదేపా సిద్ధం...నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
author img

By

Published : Aug 30, 2019, 5:35 AM IST

ప్రత్యక్ష పోరుకు తెదేపా సిద్ధం...నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
ఇసుక కొరతను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని తెదేపా శ్రేణులకు అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. 20 లక్షల మంది సెంట్రింగ్, వడ్రంగి, తాపీ వంటి నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 రకాల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని విమర్శించారు.

మూడు నెలలులో రాష్ట్ర ఆర్థికస్థితి కుదేలు

ఉపాధి కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా తెదేపా చేస్తున్న నిరసనలను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్థిక కార్యకలాపాలతోనే ఏ సమాజానికైనా ఆదాయమన్న చంద్రబాబు... గత 3 నెలలుగా రాష్ట్ర ఆర్థికస్థితి పూర్తిగా దెబ్బతిన్నందువల్లే రాబడి పడిపోయిందని అభిప్రాయపడ్డారు. ఇసుక కొరత వల్లే ఏపీ ఎకానమి కుదేలైందన్న ఆయన.. అభివృద్ధి ఉంటేనే ఏ రాష్ట్రానికైనా ఆదాయమని స్పష్టంచేశారు. 14 శాతం ఉన్న రాష్ట్ర వృద్ధి రేటు మూడోవంతుకు పడిపోయి 8 శాతానికి చేరే అవకాశం ఉందని వెల్లడించారు.

మంగళగిరిలో లోకేశ్ ధర్నా

పీపీఏలను ఏకపక్షంగా రద్దుచేయడం, పరిశ్రమలపై విచారణ, ఇసుక కొరత.. లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోవడం వంటి పరిణామాల దృష్ట్యా ఆందోళన చేపడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యచరణపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశంచేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలో ధర్నా చేపట్టనుండగా... ఇతర నాయకులు తమతమ నియోజకవర్గాల్లో ఆందోళన చేపట్టాలని సూచించారు.

అధినేత ప్రత్యక్ష కార్యాచరణ

సెప్టెంబర్ మొదటి వారం నుంచి జిల్లా పర్యటనలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సెప్టెంబర్ 5, 6 తేదీలలో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. వారంలో 2 రోజులు చంద్రబాబు జిల్లా పర్యటనలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2రోజులు పాటు అధినేత మకాం వేసి నేతలు, కార్యకర్తలను స్వయంగా కలవనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు.

రాష్ట్రానికి చెడ్డపేరు

అధికారం చేపట్టిన మూడునెలల్లోనే వైకాపా రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చిందని, రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు ముందుకు రావడంలేదని ఆక్షేపించారు. జీవనాడి లాంటి పోలవరాన్ని నిలిపేయడం, ప్రాణనాడి అయిన అమరావతిని ఆపివేయడం, ఇసుక కొరతతో నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదరణ పనిముట్లను గోడౌన్లలో కుప్పలుపెట్టి నిరుపయోగం చేయడం, వేలాది బిసి కుటుంబాలకు ఉపయోగపడే పనిముట్లను నిరర్థకం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా హయాంలో అమలు చేసిన వివిధ పథకాలు వైకాపా ప్రభుత్వం రద్దుచేయడాన్ని నేతలు ఖండించారు. లక్షలాది రేషన్‌ కార్డులు తొలగించడం, పేదల ఆకలితీర్చే అన్నక్యాంటీన్లు మూసివేయడం, రంజాన్‌ తోఫా ఇవ్వడం లేదని తీవ్రంగా తప్పుపట్టారు.

బాధితుల కోసం శిబిరం

వైకాపా వేధింపులకు నిరసనగా సెప్టెంబర్‌ 3 నుంచి గుంటూరులో బాధితులకు అండగా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పల్నాడు సహా ఇతర ప్రాంతాల బాధితులందరికీ ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే దాకా బాధితులు శిబిరాల్లోనే ఉండవచ్చని చంద్రబాబు అన్నారు. బాధితులందరికీ న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇదీ చదవండి :

'సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయింది'

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు fit ఇండియా కార్యక్రమం మున్సిపల్ అధికారులు విద్యార్థులు వివిధ శాఖల అధికారులు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ప్రతి వ్యక్తి ప్రతిరోజు వ్యాయామానికి ఒక గంట పాటు సమయం కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ నామ కనకరాజు యువతకు సూచించారు ఒక యంత్రం వాడకపోతే ఎలాంటి అయిపోతుందో అలాగే ప్రతి మనిషి ఇ రోజు వ్యాయామం చేయకపోతే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నారు రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు దేశ పౌరులంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోడీ ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు అనంతరం ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి ఎంప్లాయ్ ఐడి నెంబర్ AP 10146
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.