శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేయటాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమాను పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం ప్రభుత్వానికి చేతకావడం లేదని ధ్వజమెత్తారు. మంత్రి కొడాలి నాని జనం ముందుకు వస్తే తగ్గిన బుద్ధి చెప్తారని అన్నారు. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. గుడివాడ ప్రజల సమస్యలు పక్కనపెట్టి పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు.
ఇదీ చదవండీ... దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్