ETV Bharat / city

'కాంట్రాక్టర్ల బాగు కోసమే జలవివాదాన్ని పరిష్కరించట్లేదు' - ప్రభుత్వ తీరుపై స్పందించిన తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

సీఎం జగన్‌పై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగురాష్ట్రాల సీఎంలు.. 2నిమిషాలు కూడా కూర్చుని చర్చించుకోలేరా అని సొంత చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ కి లేదని విమర్శించారు.

TDP state general secretary Panchumarty Anuradha
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
author img

By

Published : Jul 9, 2021, 9:45 PM IST

కాంట్రాక్టర్ల బాగు కోసమే అంతరాష్ట్ర జలవివాదాన్ని పరిష్కరించట్లేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. రైతులకు రాజశేఖర్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారని రైతు దినోత్సవంగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట విరామం, పవర్ హాలిడేలు, విద్యుత్ కోతలు వంటి పదాలు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పుట్టాయని విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమం పేరిట వివిధ పేర్లతో ప్రవేశపెట్టిన పథకాలకు ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పావలా వడ్డీకి రూ.100కోట్లు కూడా ఖర్చు చేయకుండా అసత్యాలు చెప్పటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఇదీ చదవండీ.. cpi narayana: 'విశాఖ ఉక్కుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.