రమ్యశ్రీ కుటుంబసభ్యులను బెదిరించి, ప్రలోభపెట్టినంత మాత్రాన రాష్ట్రంలోని ఆడబిడ్డలకు న్యాయం జరగదని తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష మండిపడ్డారు. రెండేళ్ల వైకాపా పాలనలో ఆడబిడ్డలపై 500వరకు దారుణాలు జరిగాయని ఆమె విమర్శించారు. దుర్మార్గుల ఆకృత్యాలకు బలైన ఆడబిడ్డల కుటుంబాలకు ప్రభుత్వం ఏంన్యాయం చేసిందో, చెప్పాలని డిమాండ్ చేశారు. దిశాచట్టం అమలు, దోషులకుపడిన శిక్షలపై ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ బహిరంగచర్చకు రాగలరా? అని గౌతుశిరీష సవాల్ విసిరారు. మహిళలను వేధిస్తున్నదెవరంటే... వైకాపా నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.
ఆర్థిక సంక్షోభానికి రాజధాని లేకపోవడమే కారణమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నాడు అసెంబ్లీలో రాజధానిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న జగన్.. అధికారంలోకి వచ్చాక మాటతప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్‌పై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులు సరికాదని హితవు పలికారు. సచివాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాననడం హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. విశాఖ ప్రజలు కూడా వైసీపీ దోపిడీకి బెంబేలెత్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండీ.. VIVEKA MURDER CASE: సీబీఐ విచారణకు పులివెందుల మున్సిపల్ సిబ్బంది