అర్హులైన పేదల ఇంటికలను రోజుకో నిబంధనతో సీఎం జగన్ దూరం చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి చెంగల్రాయుడు విమర్శించారు.
"పాదయాత్రలో రూ.5లక్షలతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులు నిర్మించుకుంటే ప్రభుత్వ వాటాగా రూ.1.80లక్షలు చెల్లిస్తామంటూ మాట మార్చారు. ఇసుక, సిమెంట్, ఇనుముతో పాటు కూలీల ధరలు రెట్టింపు అయిన పరిస్థితుల్లో ఈ మొత్తం ఎలా సరిపోతుంది? 500 కిలోల ఇనుము, 90బస్తాల సిమెంట్ ఇస్తామనే మరో నిబంధన తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల నిర్మాణ ప్రకటన అంతా ఓ బోగస్" చెంగల్రాయుడు, తెదేపా అధికార ప్రతినిధి
ఇదీ చదవండి:
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు: సీఎం జగన్