TDP Protests: శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తుండగా నారా లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని రాష్ట్ర టీఎన్టీయుసీ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు విజయవాడలో ఖండించారు. లోకేశ్‌ను చూస్తుంటే వైకాపాకి వెన్నులో వణుకు మొదలైందన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా నాయకుడు ఇలా చేసి ఉంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి నిరసన చేపట్టారు. తన కుమారుడు వివాహ వేదికకు వస్తున్న నారా లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమని.. ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పొలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో తెదేపా పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
పోలీసులు లోకేశ్‌ను అదుపులోకి తీసుకోవడంపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని పలాసలో లోకేశ్ అరెస్టు నేపథ్యంలో కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాధితుల కోసం కాకుండా బాధింపబడ్డ వారి కోసం పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని ఆరోపించారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న లోకేశ్‌ను అరెస్టు చేయడమే కాకుండా.. విడుదల అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని ఉమామహేశ్వర్ నాయుడు అన్నారు.
ఇవీ చదవండి: