ETV Bharat / city

నంద్యాల ఘటనకు నిరసనగా తెదేపా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన - అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని కొవ్వొత్తుల ర్యాలీ

నంద్యాలలో అబ్ధుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసన చేపట్టాయి. వైకాపా హయాంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండాపోయిందని అరోపించారు.

tdp protest for justice to Abdul Salam family
నంద్యాల ఘటనకు నిరసనగా తెదేపా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన
author img

By

Published : Nov 11, 2020, 6:02 PM IST

Updated : Nov 11, 2020, 11:03 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఆదుకోవాలని.. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో..

ముస్లిం మైనార్టీలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ... గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. స్థానిక మార్కెట్ సెంటర్​లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నంద్యాల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని తెదేపా నేతలు ఆలపాటి రాజా, నసీర్ అహమ్మద్ డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలు చేపట్టారని... తక్షణమే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

tdp protest for justice to Abdul Salam family
సలామ్ కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన ప్రదర్శనలు

నంద్యాల ఘటనపై విచారణలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ... గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు నల్లచెరువు మదర్శ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.... ఇప్పుడు మైనారిటీలపైన దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తుందని విమర్శించారు. శాసన మండలిలో షరీఫ్​ను కించరపరచడం, సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వైకపా నేతనే కారణమని ఆరోపించారు.

నంద్యాల ఘటనను నిరసిస్తూ.. చిలకలూరిపేటలో తెదేపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఎన్​ఆర్​టీ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో తెదేపా, ముస్లిం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నంద్యాల ఘటనకు నిరసనగా తెదేపా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన
నంద్యాల ఘటనకు నిరసనగా తెదేపా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన

కర్నూలు జిల్లాలో..

నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య ఘటనపై టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని జామీయ మసీదు నుంచి సోమప్ప కూడలి వరకు శ్యాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలన్నారు. ఈ ర్యాలీలో ముస్లింలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అబ్దుల్ సలాం కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కళ్యాణ్ దుర్గంలోని ముస్లిం నాయకులు, తెదేపా నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ భవన్​లో అబ్దుల్ మౌలానా కలాం ఆజాద్ జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం తెదేపా పిలుపు మేరకు అక్కనుంచి మసీద్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం ప్రభుత్వం, పోలీసులే అంటూ పలువురు ముస్లిం నాయకులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సలామ్ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. బనగానపల్లి ఖాజీ వాడ మసీదు సమీపంలో ముస్లిం నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి తక్షణమే రూ. రెండు కోట్ల ఆర్థిక సాయం అందజేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అత్తర్ జావేద్, బురానుద్దీన్, కలాం, సలాం, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లాలో..

నంద్యాల ఘటనకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. విశాఖ జీవీయంసీ గాంధీ విగ్రహం తెదేపా ఆద్వర్యంలో ముస్లిం నాయకులు నిరనస చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మైనార్టీలకు అండగా తెదేపా ఉంటుందని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. పాడేరు అంబేడ్కర్ కూడలి వద్ద ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సలీం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం సోదరులు నినాదాలు చేశారు. రేపు కాగడాల ప్రదర్శన, 13న మసీదులలో బాధితులకు అండగా ప్రార్థన చేస్తామని తెలిపారు.

విశాఖ తెదేపా కార్యాలయంలో సలాం కుటుంబానికి కొవ్వొతులతో నివాళి అర్పించారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లంమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో...

అబ్దుల్ సలీమ్ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. రాజ్యాంగ నిబంధనలు గాలికి వదిలేసి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కేసులో పాలకులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. అబ్దుల్ సలాం కుటుంబానికి కి న్యాయం చేయాలని కోరుతూ.. నందిగామలో తెదేపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎల్​పీ సెంటర్ నుంచి ప్రారంభించిన క్యాండిల్ ర్యాలీలో పార్టీ నాయకులు కోగంటి బాబు సాంబశివరావు, వెంకట్రావు, కాజా హసీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.

కడప జిల్లాలో...

సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెదేపా నాయకులు రాజ శేఖర్, ముస్లిం మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా పేర్కొన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. తప్పు చేసిన వారికి ప్రభుత్వం అండగా నిలిచిందని రాజశేఖర్ ధ్వజమెత్తారు. వేధించిన పోలీసులకు అప్పుడే బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. వైకాపా అండదండలు ఉన్నందునే ఇలా జరిగిందని ఆరోపించారు.

చిత్తూరు జిల్లాలో...

రాష్ట్రంలో బలహీన వర్గాలకు జీవించే స్వేచ్ఛ లేకుండా పోయిందని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ తిరుపతి పెద్ద మసీదు నుంచి టౌన్ క్లబ్ ఎన్టీఆర్ కూడలి వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. అబ్దుల్ సలాం కాల్ డేటా ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించాలని.. లేనిపక్షంలో తేదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమమం చేపడతామని హెచ్చరించారు.

చంద్రగిరిలో పులివర్తి నాని ఆధ్వర్యంలో తెదేపా కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా ఎమ్మెల్యేలు... పోలీసులను అడ్డుపెట్టుకుని దళితులు, మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నారని నాని పేర్కొన్నారు. పోలీసుల వేధింపులతో ఓ కుటుంబం చనిపోతే ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

అనంతపురం జిల్లాలో....

సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పుట్టపర్తిలో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక మైనార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. గోకులం మసీదు ఎదురుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

నంద్యాల ఘటనకు నిరసనగా తణుకులోని తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఆధ్వర్యంలో ముస్లిం సమాఖ్య నాయకులు, సభ్యులు ధర్నా చేశారు. సీఎం జగన్ హయాంలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైనా పోలీసులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సమైక్య నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

శ్రీసిటీలో ఆల్​స్టోమ్ ఘనత.. ఎన్ని బోగీలు తయారు చేసిందంటే?

Last Updated : Nov 11, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.