ETV Bharat / city

'ఓ స్ఫూర్తి.. ఓ ఆదర్శం.. ఎన్టీఆర్​..!'

ఎన్టీఆర్​ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా ట్విటర్​ వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీర్​ కోట్లాది మందికి అండగా నిలిచారని కొనియాడారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​ కూడా ట్విటర్​ వేదికగా ఎన్టీఆర్​కు నివాళి అర్పించారు. ఆయన గొప్ప మానవతావాది అని ప్రశంసించారు.

'ఓ స్ఫూర్తి.. ఓ ఆదర్శం.. ఎన్టీఆర్​..!'
'ఓ స్ఫూర్తి.. ఓ ఆదర్శం.. ఎన్టీఆర్​..!'
author img

By

Published : May 28, 2020, 9:47 AM IST

Updated : May 28, 2020, 10:08 AM IST

cbn twitter
చంద్రబాబు ట్వీట్​

కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగధీరుడు ఎన్టీఆర్​ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశంసించారు. నందమూరి తారకరామారావు అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శమని అన్నారు.

ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్​.. అభ్యుదయవాది

cbn twitter
లోకేశ్​ ట్వీట్​

బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమ సమాజవాది, పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది, మహిళలకు సమాన హక్కులు కల్పించిన అభ్యుదయవాది ఎన్టీఆర్​ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​ కొనియాడారు. ఆ మహానుభావుని ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదామని ఆకాంక్షించారు. 'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అన్న మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్​ అని కొనియాడారు.

ఇదీ చూడండి:

అన్నమయ్య భవనంలో నేడు తితిదే మండలి సమావేశం

Last Updated : May 28, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.