ETV Bharat / city

'మంత్రి జయరామ్​... చర్చకు ఎప్పుడొస్తారు..?' - ఏపీ ఈఎస్​ఐ స్కామ్​ వార్తలు

చర్చకు సిద్ధమన్న మంత్రి జయరామ్​ ఎప్పుడు.. ఎక్కడికి వస్తారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అర్జునుడు డిమాండ్ చేశారు. ఈఎస్​ఐ స్కామ్​లో నిందితులుగా ఉన్నవారి నుంచి మంత్రి బెంజ్ కారు తీసుకున్నారో.. లేదో చెప్పాలన్నారు.

TDP MLCs Fires on Minister Jayaram Over ESI Scam
తెదేపా ఎమ్మెల్సీలు
author img

By

Published : Sep 18, 2020, 7:51 PM IST

అయ్యన్నపాత్రుడితో చర్చకు సిద్ధమంటున్న మంత్రి జయరామ్.. ఏ తేదీన, ఎప్పుడు, ఎక్కడకు రావాలో చెబితే.. రావడానికి సిద్ధమని తెదేపా ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. కార్తీక్ నుంచి జయరామ్ కుమారుడికి అందిన ముడుపులను మీడియా ముఖంగా బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి తక్షణమే జయరామ్​తో రాజీనామా చేయిస్తే... ప్రజలు కొంతైనా సంతోషిస్తారని హితవు పలికారు.

గుమ్మనూరు యువసేన పేరుతో ఉన్న ఫేస్​బుక్ పేజీలో కార్తీక్ బహుమతిగా ఇచ్చిన బెంజ్ కారును ఈశ్వర్ తీసుకుంటున్న ఫొటో ఉందని వెల్లడించారు. ఈఎస్ఐ స్కామ్​లో తనకు అడ్డు తగులుతున్నారని, కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఉదయలక్ష్మిపై మంత్రి జయరామ్ సీఎంవోకు ఫిర్యాదు చేయలేదా..? అని ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కామ్​లో ఏ-14గా ఉన్న ముద్దాయి ఇచ్చిన కారు తీసుకొని, అతన్ని రక్షించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని.. దీని ద్వారా తేలిపోయిందన్నారు. స్కామ్​లు చేసేది వారే.. దోచుకునేది వారే.. నిందలు మాత్రం తెదేపా వాళ్లపై వేయడం వైకాపా వాళ్లకు అలవాటైందని మండిపడ్డారు.

ఇదీ చదవండీ... కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.