ETV Bharat / city

'పెట్టడం.. ఎత్తివేయడం.. అంతా వారి ఇష్టమేనా!' - సీఎం జగన్​పై బుద్దా వెంకన్న విమర్శలు

వైకాపా నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులతో సామాన్యులు కూడా ఇబ్బందిపడుతున్నారని.. కులాలు, మతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని తెదేపా నేత బుద్దా వెంకన్న అన్నారు. రిలయన్స్​ సంస్థలపై జరగిన దాడుల కేసులు ఎందుకు ఎత్తివేశారో చెప్పాలన్నారు.

tdp mlc budda venkanna fires on cm jagan
సీఎం జగన్​పై బుద్దా వెంకన్న విమర్శలు
author img

By

Published : Mar 19, 2020, 1:03 PM IST

సీఎం జగన్​పై బుద్దా వెంకన్న విమర్శలు

వైఎస్‌ రాజశేఖర్​రెడ్డి మరణానంతరం రిలయన్స్ సంస్థలపై జరిగిన దాడుల కేసులు ఎత్తివేయడంపై తెదేపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఇష్టానుసారం తనకు నచ్చిన వారిపై కేసులు ఎత్తివేయడమేంటని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఏ కారణంతో వారిపై కేసులు ఎత్తివేశారో తెలపాలని డిమాండ్ చేశారు. అమాయకులైన రాజధాని రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెడుతున్న ప్రభుత్వం.. ఆస్తులు ధ్వంసం చేసిన వారిని మాత్రం వదిలిపెడుతోందని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

సుప్రీం నిర్ణయంపై జగన్ సమాధానమేంటి..?: కేశినేని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.