తెలంగాణ మంత్రులంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్ర పదజాలంతో ధూషిస్తుంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు ఎందుకు ఖండించలేదని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నిలదీశారు. వైకాపా నేతలంతా తెరాసతో కుమ్మక్కై, కేసీఆర్కు భయపడుతున్నారన్నది సుస్పష్టమని విమర్శించారు.
"కేసీఆర్తో జగన్రెడ్డి లాలూచీ పడి చేస్తున్న రాజకీయాలు ప్రజలకు తెలుసు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై కేసీఆర్ను నిలదీసే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డి, విజయసాయిలకు లేవు. తనపై ఉన్న కేసుల భయంతోనే దిల్లీలో కూడా ఏనాడు రాష్ట్ర హక్కులపై విజయసాయి ప్రశ్నించరు. కేసుల మాఫీ కోసం కేంద్రానికి పూర్తిగా ఇద్దరు నేతలు అమ్ముడు పోయారు. కాంగ్రెస్లో వైకాపాను విలీనం చేస్తామని గతంలోనూ సోనియా గాంధీని నమ్మించి అవినీతి కేసుల నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. విశాఖ భూముల కోసం విజయసాయి ఇప్పటికీ బ్రోకర్ పని చేస్తున్నారు." అని బండారు సత్యనారాయణ మూర్తి ఆక్షేపించారు.
ఇదీ చదవండి:MLC ramachandraiah:'ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు'