ETV Bharat / city

TDP: 'దొంగ ఓట్లు వేయించే కుట్ర జరుగుతోంది.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి' - SEC neelam

రాష్ట్ర ఎన్నికల కమిషనర్(state election commissioner) నీలం సాహ్ని(neelam sahni)కి తెదేపా నేతలు లేఖ(letter) రాశారు. నకిలీ గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేయించే కుట్ర జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో(cc camera) నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. వైకాపా ప్రభుత్వం(YCP government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసు వ్యవస్థ అప్రతిష్ఠ మూటగట్టుకుంటోందని వర్ల రామయ్య(varla ramayya) డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.

ఎస్ఈసీకి తెదేపా నేతల లేఖ
ఎస్ఈసీకి తెదేపా నేతల లేఖ
author img

By

Published : Nov 13, 2021, 7:51 PM IST

నకిలీ గుర్తింపు కార్డులతో బయటి వ్యక్తులతో దొంగఓట్లు వేయించే కుట్ర జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని(neelam sahni)కి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు(TDP leaders complaint to SEC) చేశారు. తిరుపతి ఉపఎన్నిక(tirupati by poll)లో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అనుసరిస్తున్నారని ఆ పార్టీ నేత అశోక్ బాబు(ashok babu) ఎస్ఈసీకి లేఖలు రాశారు. పోలింగ్ జరిగే తేదీల్లో బయటి నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టి... ప్రజాస్వామ్య పద్దతిలో పోలింగ్(polling) జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటమి భయంతో హింసాత్మక ఘటనలు చేసేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల(cc camera in polling centers)తో నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మునిసిపాలిటీలో(jaggayyapeta municipality) ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(MLA samineni udaya bhanu) పేరు మీద టిడ్కో ఇళ్ల(tidco houses) పంపిణీపై కరపత్రాలు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

డీజీపీ గౌతం సవాంగ్​(DGP goutham sawang)కు, ముఖ్యమంత్రి జగన్(CM jagan) మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో బహిర్గతం చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(varla ramayya) డిమాండ్ చేశారు. పలుచోట్ల పోలీసులు చట్టపరిధి దాటి ప్రవర్తిస్తూ అధికార పార్టీకి ఎందుకు అండగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని డీజీపీకి లేఖ(letter) రాశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసు వ్యవస్థ అప్రతిష్ఠ మూటగట్టుకుంటోందని లేఖలో వెల్లడించారు. పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలని కోరారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.