గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి సెల్లో పెట్టి తాళం వేశారని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు, ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రవణ్ మండిపడ్డారు. ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి(ఎన్‌హెచ్‌ఆర్సీ) విడివిడిగా లేఖలు రాశారు.
ఈ నెల 9వ తేదీ మధ్నాహ్నం గన్నవరం విమానాశ్రయంలో తమని అదుపులోకి తీసుకున్న పోలీసులు మధ్యాహ్నం ఒకటిన్నరకు కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. సాయంత్రం 6గంటల వరకూ సెల్లో పెట్టి తాళం వేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల్ని అణగదొక్కేందుకు అధికార పార్టీ అజెండాను పోలీసులు అమలు చేస్తూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని నేతలు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ttd darshan: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు