ETV Bharat / city

ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో.. తెదేపా నేతల ఆగ్రహం - andhra news

MP VIDEO VIRAL: సభ్యసమాజం తల దించుకునేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది. నగ్న వీడియో వైరల్ అవుతున్నా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. బుకాయించడం సిగ్గుచేటని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

MP VIDEO VIRAL
MP VIDEO VIRAL
author img

By

Published : Aug 4, 2022, 10:57 PM IST

Updated : Aug 5, 2022, 7:04 AM IST

వైకాపా ఎంపీ వ్యవహారశైలిపై తెలుగుదేశం ఆగ్రహం

TDP LEADERS: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడే వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గల్లీ నుంచి దిల్లీ దాకా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే.. తాను కాదని ఆయన బుకాయించడం సిగ్గుచేటని తెదేపా నాయకులు మండిపడ్డారు. సిగ్గుమాలిన పని చేసి దొరికిపోయింది కాక.. తెదేపా నాయకుల పైనా, మీడియాపైనా నిందలేయడమేంటని ధ్వజమెత్తారు. ఈ వీడియో ప్రచారంలోకి రావడం వెనుక తానున్నానంటూ ఆరోపించిన మాధవ్‌పై పరువునష్టం దావా వేస్తానని, పార్లమెంటు హక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ హెచ్చరించారు. ‘ఒక ఎంపీ ప్రైవేట్‌ వీడియోకు, నాకు ఏం సంబంధం ఉంటుంది? ఎంపీ మాధవ్‌ లోక్‌సభలో రాష్ట్రం కోసం పోరాడాల్సింది పోయి, నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతూ దొరికిపోయి, మార్ఫింగ్‌ చేశారంటూ మాపై నిందలు వేయడమేంటి? ఆ వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తామని చెబుతున్న మాధవ్‌ నిజంగా తప్పు చేయకపోతే భయపడాల్సిన పనేంటి? జగన్‌ మొన్నటిదాకా నా తండ్రిని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇప్పుడు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను రోడ్డుపైకి లాగాలని చూస్తున్నారు’ అని విజయ్‌ మండిపడ్డారు.

మాధవ్‌ తక్షణం రాజీనామా చేయాలి: కాల్వ శ్రీనివాసులు

‘మాధవ్‌ ఏ రోజూ ప్రజాసమస్యలపై పోరాడింది లేదు. తోటి ఎంపీలపై దాడులు చేస్తూ, బూతులు తిడుతూ, పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తూ అసాంఘిక శక్తిగా మారారు. ఎంపీగా ఉంటూ పాడుపనులు చేసి రాష్ట్రం పరువు తీశారు. మాధవ్‌ కోరినట్టుగా కేంద్ర ఫోరెన్సిక్‌ విభాగంతో దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. మాధవ్‌ తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలి’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

మాధవ్‌తో రాజీనామా చేయించండి: అనురాధ
గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నాటకాలాడుతున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. ‘అరగంట మంత్రిని మీ పార్టీ ఏం చేసింది? గంట అన్న నాయకుడికి మంత్రి పదవి ఇచ్చి సత్కరించింది. వాళ్ల లేకి బాగోతాలు బయటపడ్డప్పుడే చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు’ అని మండిపడ్డారు. మాధవ్‌తో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని, పార్టీ నుంచీ తొలగించాలని డిమాండ్‌ చేశారు.

మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న నగ్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నా..ఎంపీ గోరంట్ల బుకాయించడం దారుణమని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ‍మహిళల్ని వేధిస్తున్న, అత్యాచార యత్నాలు చేసిన వారినీ.. వైకాపాలో అందలం ఎక్కిస్తున్నారని బొండా ఆరోపించారు. సీఎం జగన్ వెంటనే ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే.. మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తామని తెదేపా మహిళ నేతలు చెప్పారు.

వైరల్ అవుతున్న సహచర వైకాపా ఎంపీ వీడియోపై.. ఫోరెన్సిక్ నివేదిక అవసరమని.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏపీలో కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రయోగశాలలకు వీడియోను పంపించాలన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 5, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.