ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి.. తమ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు కేసులపై ప్రజలంతా చర్చించుకుంటే తన తప్పులు, వైఫల్యాలను మర్చిపోతారనేది జగన్ ఎత్తుగడ అని ఆయన ఆక్షేపించారు. ఎస్సీ భూముల్లో నిర్మించిన ఇడుపులపాయలో ఉంటున్న జగన్మోహన్ రెడ్డే ఎస్సీలకు పెద్ద ద్రోహి అని విమర్శించారు. ఇళ్లపట్టాలపేరుతో వేలాది ఎకరాలు గుంజుకుని సెంటు పట్టా చేతిలో పెట్టిన సీఎంపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, ఎస్సీల రక్షణకోసం తెచ్చిన చట్టాన్ని ముఖ్యమంత్రి రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
ధరల పెరుగుదలను పట్టించుకోరా?: సయ్యద్ రఫీ
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు రూ.5వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి సొమ్ము ఏమైందని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ నిలదీశారు. మంత్రులకు పేకాడించడం, ఇసుక అమ్ముకోవడం, చంద్రబాబుని దూషించేందుకే పరిమితమయ్యారని విమర్శించారు. ధరల పెరుగుదలపై ఒక్కరోజూ సమీక్షించలేదని సయ్యద్ రఫీ దుయ్యబట్టారు. మహిళలు రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డిని నిలదీసేవరకు ధరల పెరుగుదలను పట్టించుకోరా అని నిలదీశారు.
ఇదీ చదవండి:
'తెదేపా అండగా ఉంటుంది.. ప్రాణత్యాగాలు చేసుకునే నిర్ణయాలు వద్దు'