ETV Bharat / city

జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలి: నారా లోకేశ్ - పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై తెదేపా నేతల స్పందన

వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు గాయాల నివేదిక సుప్రీంకోర్టుకు అందడం, పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై.. తెదేపా మాక్ అసెంబ్లీలో చర్చించారు. ఈ ఘటనలపై ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు స్పందించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. సీఎం జగన్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

tdp leaders on mp raghurama case, hc verdict on parishath elections
ఎంపీ రఘరామ, పరిషత్ ఎన్నికలపై తెదేపా నేతల స్పందన
author img

By

Published : May 21, 2021, 7:06 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు కాలికి గాయాలున్నాయంటూ సుప్రీంకోర్టుకు నివేదిక అందడం.. రాష్ట్రంలో నియంత పాలనకు అద్దం పడుతోందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సును విస్మరించిన సీఎం జగన్.. కక్ష సాధింపు, ప్రతిపక్షాల అణచివేతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే సంకెళ్లు, పోరాడితే హింసించడమనే అజెండాతో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి..

సొంత పార్టీ ఎంపీని కొట్టించినందుకు జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. తెదేపా శాసన సభాపక్షం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో.. రఘురామకృష్ణరాజుకు సంబంధించి సుప్రీంకోర్టుకు అందిన వైద్య నివేదికపై నేతలు స్పందించారు. ఈ నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒక ఎంపీకే రక్షణ లేదని తేలితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు.

కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. ప్రజాస్వామ్యానికి ఊపిరి లభించిందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని సీఎం జగన్ అమలు చేయాలని హితవు పలికారు. పరిషత్ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదని ఆరోపించారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు రావడం లేదని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి.. కేంద్ర బలగాలతో ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ మంజూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.