స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ ఎస్ఈసీ వెలువరించిన నిర్ణయంపై.... ముఖ్యమంత్రి జగన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.... తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం పైనా.... రాజకీయ విమర్శలు చేయడం హేయమన్న నేతలు... ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో మండిపడ్డ నారా లోకేశ్.... ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడటం మానుకోవాలని హితవు పలికారు. పరిస్థితుల బట్టి ఎన్నికలను వాయిదా వేసే హక్కు.. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌కు ఉంటుందన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు.... తానే సర్వాధికారి అనే భావాన్ని జగన్ విడనాడాలని సూచించారు
వ్యవస్థలంటే లెక్కలేదా...
ముఖ్యమంత్రికి వ్యవస్థలంటే ఎంత లెక్కలేని తనమో.... రమేశ్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్న మరో నేత కాలవ శ్రీనివాసులు...జగన్..ముందు ముందు కోర్టులను సైతం ప్రశ్నిస్తారేమో అని ఎద్దేవా చేశారు. అధికారులను విధుల నుంచి తప్పించడాన్ని స్వాగతించిన మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి.... వైకాపా నేతలు చేసిన అరాచకాలు సీఎంకు కనిపించలేదా అని ప్రశ్నించారు
ఎన్నికల్లో జరిగిన బెదిరింపులపై పూర్తి స్థాయిలో ఈసీ చర్యలు తీసుకోలేదన్న తెదేపా నేతలు... మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.