ETV Bharat / city

TDP: గన్ను కంటే వేగంగా వస్తాడన్న జగన్ ఎక్కడ ?:తెదేపా - చంద్రబాబు ముఖ్యంశాలు

యూజర్ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపు చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేయకుంటే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్షం తెదేపా(TDP) హెచ్చరించింది. వైకాపా పాలనలో మహిళా భద్రత గాల్లో దీపంలా మారిందనటానికి ఆదోనిలో హోంగార్డు రామలక్ష్మి, విశాఖలో లక్ష్మీ అపర్ణల ఘటనలే ఉదాహరణ అని పేర్కొన్నారు. గన్ను కంటే వేగంగా వస్తాడన్న జగన్ ఎక్కడని వారు ప్రశ్నించారు.

గన్ను కంటే వేగంగా వస్తాడన్న జగన్ ఎక్కడ ?:తెదేపా

author img

By

Published : Jun 7, 2021, 7:52 PM IST

పట్టణాల్లో యూజర్ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపు చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేయకుంటే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్షం తెదేపా(TDP) హెచ్చరించింది. అధికార పార్టీ అండతోనే మహిళలపై పోలీసుల జులుం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో నాయకులు ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో మహిళా భద్రత గాల్లో దీపంలా మారిందనటానికి ఆదోనిలో హోంగార్డు రామలక్ష్మి, విశాఖలో లక్ష్మీ అపర్ణల ఘటనలే ఉదాహరణ అని పేర్కొన్నారు.

సీఐ సురేష్ వేధింపులు కారణంగానే కర్నూలు జిల్లా ఆదోనిలో హోంగార్డు రామలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారని విమర్శించారు. సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను చెప్పుకున్నా బాధ్యులైన పోలీసులపై చర్యలు లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా? అని నిలదీశారు. గన్ను కంటే వేగంగా వస్తాడన్న జగన్ ఎక్కడని ప్రశ్నించారు. విశాఖలో కొవిడ్ వారియర్ లక్ష్మీ అపర్ణ అనే యువతి పట్ల పోలీసుల తీరు అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ సమయంలో బయటకు వెళ్లేందుకు అన్ని పత్రాలు ఉన్నా ఆమెను అడ్డుకుని అనుచితంగా ప్రవర్తించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ప్రశ్నించే వారిపై పోలీసుల ద్వారా వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సిమెంటు, స్టీలు, ఇసుక ధరలు నాలుగు రెట్లు పెరిగిన తరుణంలో గృహనిర్మాణ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీని పెంచకపోగా లక్ష నుంచి 30వేలకు తగ్గించటం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆప్షన్​ను లబ్ధిదారులంతా ఎంచుకుంటే ఆ ఆప్షన్ ను ఎందుకు తొలగించారని దుయ్యబట్టారు. కనీస మౌలిక సౌకర్యాలు లేకుండా ఇళ్ల నిర్మాణంపై ఒత్తిడి తేవటం తగదన్నారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో 90శాతానికి పైగా పూర్తి చేసిన 2.62లక్షల పైచిలుకు టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయుర్వేద వైద్యంతో చేతనైన సాయం చేస్తున్న ఆనందయ్యకు స్వేచ్ఛ ఇవ్వకుండా పెత్తనం చేస్తూ జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన సోమిరెడ్డిపై కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే కేంద్ర ప్రభుత్వం అందించిన వ్యాక్సిన్‌ వృథా చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉందని నేతలు ఆరోపించారు. కేంద్రానికి ఉపయోగం లేని లేఖలు రాయటం, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కులం అంటగట్టి దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్లోబల్‌ టెండర్ల పేరుతో కాలక్షేపానికే పరిమితం కాకుండా దేశీయంగా వ్యాక్సిన్‌ కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం భూసేకరణలో గిరిజన మహిళల పేరుతో దొంగ అకౌంట్లు సృష్టించి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్న వైకాపా నేతలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నరేగా బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం సేకరణ పూర్తిగా చేసి కొనుగోళ్ల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. సీఐడి ఆధీనంలో ఉన్న ఎంపీ రామకృష్ణంరాజు ఫోన్‌ నుంచి పలువురికి మెసేజ్ లు వెళ్లటం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ap corona cases: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.