‘వందలాది ఆలయాలపై దాడులు చేశానని పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలపై ఏ విచారణ జరిపారు? ఆ వివరాలను ఎందుకు బహిరంగ పరచడం లేదు?’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ‘మతోన్మాదాన్ని, ద్వేషాన్ని రెచ్చగొడుతున్న పాస్టర్ ప్రవీణ్‌కు.. బ్రదర్ అనిల్ కుమార్‌తో ఉన్న సంబంధాలేంటి? మంత్రి కన్నబాబు, వంగా గీతల సభల్లో ప్రవీణ్ ఎందుకున్నారనే దానిపై ఏం నిర్ధారణకు వచ్చారు’ అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. అసలు దోషుల్ని కాపాడటానికి.. ఆలయాలపై దాడులను వెలుగులోకి తెచ్చిన సామాజిక మాధ్యమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, వాటిని ప్రతిపక్షాలకు ఆపాదించడం ప్రవీణ్‌ను కాపాడటానికి కాదా? అని ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు.
‘వందలాది ఆలయాలపై నేనే దాడులు చేశా. మా వాళ్లతోనూ చేయించా. ఇప్పటివరకు 699 హిందూ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చేశాం. మరిన్ని గ్రామాలనూ మార్చేస్తాం’ అని పాస్టర్ ప్రవీణ్ అమెరికాలో విరాళాలిచ్చే క్రైస్తవుడితో మాట్లాడింది తీవ్రమైన విద్వేష ప్రసంగం కాదా? దేశద్రోహం కాదా? 2019 డిసెంబరు 23న ఈ ప్రసంగాన్ని విడుదల చేస్తే 2021 జనవరి వరకు ప్రవీణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? సకాలంలో గుర్తించినా జగన్ ఒత్తిడితో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేశారా’ అని నిలదీశారు.
‘అమెరికా నుంచి ఎన్ని నిధులు తెచ్చారు? వాటితో సంఘ విద్రోహ శక్తుల ద్వారా ఎన్ని ఆలయాలపై దాడులు చేయించారో విచారించారా? విగ్రహాల ధ్వంసంలో ఎంత మంది పాల్గొన్నారో తేల్చి కేసులు పెట్టారా?’ అని ప్రశ్నించారు.
ఇన్నాళ్లు అరెస్టు చేయలేదెందుకు?
దేవాలయాలపై దాడులు చేశామని పాస్టర్ ప్రవీణ్ స్వయంగా చెప్పినా.. అరెస్టు చేయకుండా ఏడాదిపాటు ఏం చేశారు? ఇప్పటికైనా ఆయన్ను అరెస్టు చేశారా? లేదా? బ్రదర్ అనిల్ కుమార్‌కు, ప్రవీణ్‌కు సంబంధాలున్నాయి. అన్నీ జగన్ దర్శకత్వంలోనే జరుగుతున్నాయి. కన్నబాబు సహా ఇతర నాయకులతోనూ ప్రవీణ్‌కు ఎలాంటి సంబంధాలున్నాయో తేల్చాలి.
- మాజీ మంత్రి చినరాజప్ప
ఇలాంటి వారిని శిక్షిస్తేనే గౌరవం
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేసి నాలుగు రోజులైనా.. ఇప్పటికీ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు? అతడి వెనక ఎవరున్నారు? ఆయన వెనకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం దగ్గరి బంధువుల వివరాలను మీడియాకు ఎప్పుడు చెబుతారు? గోపూజలు చేస్తే కాదు.. ఇలాంటి వ్యక్తుల్ని శిక్షిస్తేనే హిందువులపై మీకు గౌరవం ఉందని ప్రజలు నమ్ముతారు.
- తెదేపా నేత అయ్యన్నపాత్రుడు
ఇదీ చదవండి: