ETV Bharat / city

అనాగరిక చర్యలతో రాష్ట్రం ఎటు పోతోంది?: తెలుగుదేశం - వైకాపాపై తెదేపా విమర్శలు

ఇళ్ల స్థలాల పంపిణీ, రుణాలు ఇవ్వట్లేదని బ్యాంకుల ముందు చెత్త వేయటం, స్నేహలత హత్య ఘటనలపై తెదేపా నేతలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇళ్ల స్థలాల భూసేకరణలో భారీ అవినీతి జరిగిందని నేతలు ఆరోపించారు.

chandra babu
chandra babu
author img

By

Published : Dec 25, 2020, 12:32 PM IST

ప్రభుత్వ మాట విననందుకు కృష్ణా జిల్లాలో బ్యాంకు కార్యాలయాల వెలుపల అధికారులు చెత్తపోసి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ఘటన తనను షాక్​కు గురి చేసిందని అన్నారు. ఈ నీచమైన చర్య రాష్ట్ర కీర్తి, పేరు ప్రతిష్ఠలపై ప్రభావం చూపుతుందని దుయ్యబట్టారు. ఇలాంటి దారుణమైన అనాగరిక చర్యలతో రాష్ట్రం ఎటుపోతోందని ట్విటర్​లో ప్రశ్నించారు. మరోవైపు వివిధ ప్రకటనలలో వైకాపా సర్కార్​పై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.

చెత్త పాలన అని మరోసారి నిరూపించుకున్నారు

బెదిరించేందుకు బ్యాంకు కార్యాలయాల ముందు చెత్తపోసి జగన్ రెడ్డిది చెత్త పాలన అని మరోసారి నిరూపించుకున్నారు. సీఎం బెదిరింపులకి రాష్ట్రానికి 200 సంస్థలు గుడ్ బై చెప్పాయి. ఇలాంటి చెత్త చర్యలతో బ్యాంకులు కూడా బై బై చెప్పడం ఖాయం. చెత్త పోసి బ్యాంకులను భయపెట్టిన చెత్త సీఎంగా జగన్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోతారు- అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

సీఎం, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి

నివాస యోగ్యం కాని స్థలాలు ఇస్తున్నందుకు సీఎం జగన్, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి. అక్రమ రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేసే బదులు బీసీ నాయకుల విగ్రహాలు లేకుండా చేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి. స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న విగ్రహంపై మంత్రి సీదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తాం. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తామని రాజ్యంగంపై చేసిన ప్రమాణాన్ని అటకెక్కించారు. కులం బురదలో వైకాపా నేతలంతా కొట్టుమిట్టాడుతున్నారు- అనగాని సత్యప్రసాద్​, రేపల్లె ఎమ్మెల్యే

41మంది జైలుకెళ్లడం ఖాయం

తెలుగుదేశం కేసుల వల్లే ఇళ్లస్థలాలు ఇవ్వలేకపోతున్నామని అసత్య ప్రచారాలు చేసిన జగన్....ఇవాళ ఎలా పంపకాలు చేపడుతున్నారు. పేదలకిచ్చే సెంటు స్థలం...వైకాపా నేతలకు కుంభస్థలం. స్థలసేకరణ, చదును, పంపిణీ పేరుతో 3రకాలుగా పేదల రక్తాన్ని జలగల్లా పీల్చారు. పేదల ఇళ్లస్థలాల పేరిట 6,500కోట్లు దోచుకున్నారు. కొండలు, గుట్టల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాల భూసేకరణకు సంబంధించి ఇప్పుడున్న ఆధారాలతో 41 మంది ఎమ్మెల్యేలు జగన్ రెడ్డితో పాటు జైలుకెళ్లడం ఖాయం. తెదేపా హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ చేరిగిపోదు- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఆ చట్టం ఓ అబద్ధం

చెల్లమ్మలని కాపాడలేని వ్యక్తి అన్న ఎలా అవుతాడు. బుల్లెట్ కంటే వేగంగా వస్తానన్న జగన్ రెడ్డి రాడే. దిశ చట్టం ఓ అబద్ధం. రోజుకో మహిళ బలైపోవడం నిజం. ఇంకెంత మంది మహిళలు బలైతే తాడేపల్లి కోటలో మొద్దునిద్ర పోతున్న వ్యక్తి లేస్తారు?- బుద్ధా వెంకన్న, తెదేపా ఎమ్మెల్సీ

ఇదీ చదవండి

ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.