ETV Bharat / city

చంద్రబాబు సహా.. తెదేపా సభ్యుల సస్పెన్షన్ - నివర్ తుపానుపై చర్చ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు సహా 14 మంది తెలుగుదేశం శాసన సభ్యులు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నుంచి ఒక రోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రభుత్వ చర్యను.. తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు రైతుసమస్యల పరిష్కారం కోసం పోడియంలోకి వెళ్తే సస్పెండ్ చేస్తారా? అని.. ప్రశ్నించారు.

నివర్​ తుపానుపై చర్చ.. తెదేపా సభ్యుల సస్పెన్షన్

author img

By

Published : Nov 30, 2020, 10:27 PM IST

Updated : Dec 1, 2020, 6:20 AM IST

శాసనసభ శీతాకాల సమావేశాల్లో.. తొలిరోజే సస్పెన్షన్ల పర్వం చోటు చేసుకుంది. సమావేశాల నుంచి... ఒక రోజుపాటు తెలుగుదేశం అధినేత సహా.. 14 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వరదలు, నివర్ తుపాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బ తిన్న రైతులకు పరిహారం విషయమై తమను మాట్లాడనివ్వట్లేదంటూ చంద్రబాబు, సహా ఇతర ఎమ్మెల్యేలు.. స్పీకర్ పోడియం ఎదుట నిరసన చేపట్టారు. వారిని సీట్ల వద్దకు వెళ్లాలని సభాపతి కోరారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల..... శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.... తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణీ ద్వారా దాన్ని ఆమోదించాక.. చంద్రబాబు సహా 14 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.

రైతులను ఆదుకుంటాం: కన్నబాబు

నివర్ తుపానుతో 6.59లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ 15 వరకు పంట నష్టంపై అంచనా వస్తుందని.. డిసెంబర్ 31 వరకు తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించినట్లు.. కన్నబాబు చెప్పారు. అనంతపురం వంటి కరవు ప్రభావిత ప్రాంతాల్లో కూడా.. ఈ ఏడాది భారీగా వర్షాలు కురిసి పంటనష్టం జరిగినట్లు కన్నబాబు వివరించారు. 2019 మే నుంచి పంట నష్టపోయిన 4.20 లక్షల మంది రైతులకు 306.9 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. ఇదే సమయంలో 1.16 లక్షల మంది ఉద్యానవన రైతులకు 102. 24 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చామన్నారు. పంట బీమా కోసం 2019- 20లో వెయ్యి 30 కోట్లను చెల్లించినట్లు తెలిపారు.

పీటీఐ సౌజన్యంతో...

Last Updated : Dec 1, 2020, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.