మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, ఎమ్మెల్యే చెప్పిందే తమకు వేదమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే చెప్పిందే అక్కడ రాజ్యాంగం అన్నట్లుగా పరిస్థితి తయారైందని మండిపడ్డారు. అక్కడి పోలీసులు సైతం హద్దులు మీరి ప్రవర్తిస్తూ... ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శించారు.
ఎస్ఈసీ తక్షణమే మాచర్ల, గురజాల ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్ పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, పుంగనూరులో తక్షణమే ఎన్నికల ప్రక్రియను రద్దుచేసి, అక్కడున్న పోలీస్ అధికారులను బదిలీ చేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో మరోసారి ఎన్నికలు జరిగేలా రీనోటిఫికేషన్ ఇవ్వాలని యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'పుంగనూరులో వైకాపా నేతల తీరుపై ఎస్ఈసీ, డీజీపీ చర్యలు తీసుకోవాలి'