ఆలయాలపై దాడులు చేస్తున్న వారు తనకు తెలుసన్న సీఎం జగన్‌కు డీజీపీ నోటీసులివ్వాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసిన ఆయన... సీఎం ప్రసంగ వీడియోను జతచేశారు.
నెల్లూరు అమ్మఒడి సభలో ఆలయాలపై దాడుల గురించి ప్రస్తావించిన సీఎం.... రథాలు తగలబెట్టినవారే రథయాత్రలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారన్నారు. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసు ఇచ్చి ఆలయాలు ధ్వంసం చేసిందెవరో రాబట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చట్టానికి ముఖ్యమంత్రి అతీతులు కారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: