జగన్ కు ఓట్లేసిన ఎస్సీలంతా, తప్పుచేశామా అని ఆలోచిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ -19ను జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలగించారా అని ప్రశ్నించారు. శిరోముండనం చేయడం ప్రాణం తీయడంతో సమానమని, అదేపని వైకాపా నాయకులకు, ప్రభుత్వ పెద్దలకుచేస్తే ఒప్పుకుంటారా అని నిలదీశారు.
ఇసుక మాఫియాను ప్రశ్నించడమే వరప్రసాద్ చేసిన నేరమా అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. స్థానిక ఎస్సైని అరెస్ట్ చేశామనడం కాదు, కీలకమైన కృష్ణమూర్తిని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎస్సై కాల్ లిస్టును కేసు దర్యాప్తు చేస్తున్న వారు పరిశీలించారా అని ప్రశ్నించారు. దళిత బాలికపై జరిగిన అత్యాచార విషయం ముఖ్యమంత్రికి తెలుసో..లేదో.. అని ఎద్దేవా చేశారు. నిజంగా జరిగిన దుర్మార్గం ఆయనకు తెలిసుంటే, ఘటన దర్యాప్తు మరోలా ఉండేదన్నారు.
ఇదీ చదవండి : అమరావతి ప్రాంతం మరో నందిగ్రామ్ కాకుండానే మేల్కోవాలి