'ఏడు తుపానుల వల్ల 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది... కానీ పంటల బీమా ఇస్తున్నది రాష్ట్రంలో 15.15 లక్షల మంది రైతులకు మాత్రమే' అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. చేసేది రైతు దగా- కప్పిపెట్టుకోవడానికి ప్రకటనల హవా అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లోనూ అన్నీ అబద్ధాలే అన్న సోమిరెడ్డి.. బూటకపు లెక్కలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
రైతులు 15 వేల కోట్ల రూపాయల మేర పంట నష్టపోతే.. జగన్ రెడ్డి ఇస్తున్నది నామమాత్రమేనన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండానే చెల్లించినట్లు జగన్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధం చెప్పారన్న ఆయన..ప్రతిపక్ష నేత నిలదీసిన తర్వాత అదేరోజు రాత్రి 590 కోట్ల రూపాయల ప్రీమియం కోసం జీవో విడుదల చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం మోసపూరిత విధానాలు విడనాడి కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: