రైతుభరోసా, సున్నావడ్డీ, పంటలబీమాకు సంబంధించి వైకాపా ప్రభుత్వం రైతులను నిలువునా వంచించిందని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతులను మోసగించిన సీఎం జగన్ ఏ మొహం పెట్టుకొని తిరుపతి ఉపఎన్నికలో వారిని ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు.
సారవంతమైన రైతుల భూములను.. సీఎం జగన్ తనపై ఉన్న కేసుల భయంతో ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి సిద్ధమయ్యాడని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 972మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. రైతులనే పట్టించుకోని ముఖ్యమంత్రి.. మిగిలిన వారికి న్యాయం చేస్తాడా అని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: అనిశా నివేదికతో.. వెలుగులోకి దుర్గ గుడి ఈవో తప్పిదాలు