ETV Bharat / city

సీఎం జగన్​కు లోకేశ్​ లేఖ.. నష్టాల్లో ఉన్న సుబాబుల్​ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి - సుబాబుల్​ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి

LOKESH LETTER TO CM JAGAN : వివక్ష లేకుండా రైతులందరి నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. గిట్టుబాటు ధరలేక సుబాబుల్ రైతులు నష్టాల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. సుబాబుల్ కొనుగోళ్లలో రాజకీయ జోక్యం నివారించాలని సీఎంను కోరారు.

lokesh letter to cm jagan
lokesh letter to cm jagan
author img

By

Published : Sep 30, 2022, 7:30 PM IST

Subabul Farmers Issues : సుబాబుల్ పంట కొనుగోళ్లలో రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. వివక్ష లేకుండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమంచి పండించిన పంటను అమ్మి సొమ్ము చేసుకోవాలంటే.. అధికార పార్టీకి చెందిన వారికే విక్రయించాలనే నూతన సంస్కృతి రాష్ట్రంలో రావడం దురదృష్టకరమని మండిపడ్డారు.

అసలే మద్దతు ధర లేక రైతులు నష్టపోతుండగా వచ్చిన పంటను విక్రయించాలంటే.. అధికార పార్టీ నేతలకో, లేక వారి సూచించిన దళారులకే అమ్మాలని హుకుం జారీ చేయడం దారుణమన్నారు. ఒకవేళ అధికార పార్టీ సిఫార్సులతో దళారులకు విక్రయించినా ధరలో కోత పెడుతున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి పంటను తరలించే లారీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమున్న దళారులకే పంట కొనే హక్కు ఉందంటూ పోలీసులు సైతం వారికి వంత పాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

మూడున్నరేళ్లుగా గిట్టుబాటు ధరలేక సుబాబుల్ రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని వాపోయారు. గత కొద్ది రోజులుగా పరిశ్రమలు సుబాబుల్ కర్ర కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్న లోకేశ్‌.. అయితే రైతులు తాము పండించిన పంటను మద్దతు ధరకు, తమకు నచ్చిన వారికి విక్రయించుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు, లేదా వారి సూచించిన దళారులకే పంట అమ్మాలనే బెదిరింపులతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆక్షేపించారు.

గత ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటువేయని వారి పంటను కొనబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తమ పంటను విక్రయించేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్​లో రైతులు పడిగాపులు కాయడం ఎంత వరకు సమంజసం అని మండిపడ్డారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకునే హక్కు ఉందన్నారు. సుబాబుల్ పంట కొనుగోలు విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల బెదిరింపులను నియంత్రించి, కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

  • సుబాబుల్ పంట కొనుగోళ్ళలో కూడా రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వివక్ష లేకండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలి అంటూ సిఎం జగన్ రెడ్డి కి లేఖ రాసాను. అసలే మద్దతు ధర లేక రైతులు నష్టపోతుండగా, వచ్చిన పంటను విక్రయించాలంటే..(1/3) pic.twitter.com/fkVrDH36jY

    — Lokesh Nara (@naralokesh) September 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.