ETV Bharat / city

'2019కు ముందు పనితీరుకు గుర్తింపుగానే ఏపీకి 1వ ర్యాంకు'

author img

By

Published : Sep 5, 2020, 6:51 PM IST

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో ఆంధ్రప్రదేశ్​కు.. 2019కు ముందు పని తీరు ఆధారంగానే ఇప్పుడు మొదటి ర్యాంకు దక్కిందని తెదేపా నేత కుంటుంబరావు అన్నారు. ఈనాడు సాధించిన ఘనత.. నాటి తెదేపా ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం భేషజాలకు పోకుండా.. ర్యాంకును కాపాడుకునేలా పని చేయాలని సూచించారు.

tdp leader kutumbarao
tdp leader kutumbarao
తెదేపా నేత కుటుంబరావు

సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలవడం సంతోషకరమని తెదేపా నేత కుటుంబరావు అన్నారు. 2019 మార్చికి ముందు సంస్కరణల ఆధారంగా ర్యాంకులను కేంద్రం ప్రకటించిందన్నారు. 2019 జూన్ తర్వాత పరిగణిస్తే ఏపీ పదో స్థానంలో ఉండేదని చెప్పారు. తెదేపా విధానాలు కాపీ కొట్టడం తప్ప.. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఆలోచించట్లేదని విమర్శించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ర్యాంకును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

"రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు వచ్చేలా చొరవ తీసుకోవాలి. తెదేపా ప్రభుత్వ విధానాలు సరైనందునే ఏపీకి అగ్రస్థానం. పెట్టుబడుల ఆకర్షణకు చంద్రబాబు తీసుకున్న చర్యలే ఏపీకి ఘనత సాధించాయి. తెదేపా క్రెడిట్‌ ఉపయోగించుకుని.. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చొరవ చూపాలి" అని కుటుంబరావు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో ఏపీ టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.