ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు మార్గం సుగమం కావటంతో వైకాపా నేతల్లో అసహనం పతాకస్థాయికి చేరిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. కడపలో నిమ్మగడ్డ నిర్వహించిన మీడియా సమావేశంపై వైకాపా నేతలు అసభ్యంగా మాట్లాడారని తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఓ ఐఏఎస్ అధికారి పనిచేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని పట్టాభి పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా ఇతర అధికారులు ఇలానే పనిచేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని హితవు పలికారు.
ఇదీ చదవండి: 'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక