వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఏం తప్పు చేశారని నిలదీశారు. విచారణ పేరుతో దేవినేని ఉమను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. సీఐడీ అధికారులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వివేకా హత్య కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. పైనుంచి ఒత్తిడి వచ్చిందని చెబితే కుదరదని.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
తీవ్ర పరిణామాలు తప్పవు: నెట్టెం రఘురాం
ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తెదేపా నేతలు నెట్టెం రఘురాం, శ్రీరాం రాజగోపాల్ విమర్శించారు. వీడియో ఫోర్జరీ చేశారు అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. విచారణ పేరుతో గంటల తరబడి వేధిస్తున్నారని, విచారణలో చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తామనడం జగన్ కుట్రకు నిదర్శనంగా పేర్నొన్నారు. ప్రభుత్య అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమలపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారని ఆరోపించారు. అక్రమ కేసులతో వేధిస్తున్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు