తన కుమార్తెకు తెల్లరేషన్ కార్డు ఉందంటూ ఓ పత్రికలో అవాస్తవ ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. 25 ఎంపీలు గెలిస్తే హోదా తెస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చిన జగన్ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు పెట్టలేరని స్పష్టం చేశారు. కులపరమైన రాజకీయాలు మానుకోవాలని వైకాపా ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి, కాజ, నంబూరులో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: