ETV Bharat / city

రాష్ట్ర ఖజానా వైకాపా ప్రభుత్వ బ్యాంకు కాదు: దేవినేని

సీఎఫ్​ఎంఎస్​లో అదనపు చెల్లింపుల వ్యవహారం సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. దీనికి సీఎం, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్ర ఖజానా ఏమీ వైకాపా ప్రభుత్వ బ్యాంకు కాదు: దేవినేని

author img

By

Published : Aug 14, 2020, 5:23 PM IST

సీఎఫ్​ఎంఎస్​లో జరిగిన డబుల్​ పేమెంట్​ వ్యవహారంపై మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై ప్రేమతోనే ఈ రెట్టింపు మొత్తాలు జమ చేశారని ఆయన విమర్శిచారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని.. ప్రజాపద్దుల సంఘం కూడా ఈ అంశాన్ని విచారణకు స్వీకరించాలని వ్యాఖ్యానించారు. జులై 30న ప్రభుత్వ ఖజానా నుంచి రూ.1,400 కోట్లు పోయాయని ఆరోపిస్తే.. సీఎఫ్​ఎంఎస్​ రూ.649 కోట్లుగా అంగీకరించడంపై ఆయన మండిపడ్డారు.

అదనపు చెల్లింపులు సాంకేతిక తప్పిదం అని చెప్పడం సిగ్గుచేటని దేవినేని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఏమీ వైకాపా ప్రభుత్వ బ్యాంకు కాదన్న ఉమా... జరిగిన పొరపాటుకి ఎవరు బాధ్యత తీసుకుంటారో... ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లకు జరిగిన అదనపు చెల్లింపుల సంగతేంటని ప్రశ్నించారు.

ఇదీ చూడండి..

పూర్తి భద్రతా చర్యల అనంతరమే విద్యాసంస్థలు తెరవాలి: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.