అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు నిలిచిపోయాయని తెదేపా నేత దేవినేని ఉమా ఆరోపించారు. గత 14 నెలలుగా విమర్శలు చేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమిలేదని విమర్శించారు. కొద్దిపాటి నిధులు ఖర్చుచేస్తే నిర్మాణాలు పూర్తిచేయవచ్చని అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: