పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాజధాని ఆందోళనలకు మద్దతుగా చింతమనేని 'చలో అమరావతి'కి పిలుపునిచ్చారు. చింతమనేనితో కలిసి అమరావతికి 200 కార్లతో పెద్ద ఎత్తున బయల్దేరేందుకు రైతులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు... అనుమతి లేని కారణంగా ఆయన్ను ఇంటికే పరిమితం చేశారు.
పోలీసుల కళ్లుగప్పి...
చింతమనేని గృహ నిర్బంధంపై తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల కళ్లు గప్పి చింతమనేని అమరావతికి పయనమయ్యారు.
ఇదీ చదవండి: