VIJAY LETTER TO AP CID : 41-ఏ నోటీసులపై సీఐడీకి చింతకాయల విజయ్ లేఖ రాశారు. ఈ లేఖను అందించేందుకు సీఐడీ కార్యాలయానికి విజయ్ తరఫు న్యాయవాదులు వెళ్లారు. విజయ్ రాసిన లేఖను అధికారులకు ఇచ్చేందుకు 4గంటల పాటు సీఐడీ కార్యాలయంలో వేచి ఉన్నారు. లేఖను అధికారులు తీసుకోకపోవడంతో తప్పాల్‌లో ఇచ్చి వెళ్లారు. విజయ్‌కు ఏపీ సీఐడీ ఇచ్చిన 41-ఏ నోటీసులు చెల్లవని.. అందులో ఎలాంటి వివరాలు లేవని న్యాయవాదులు తెలిపారు.
విజయ్‌కు లేదా కుటుంబ సభ్యులకు 41-ఏ నోటీసులివ్వాలని.. ఇంట్లో పని మనుషులకు నోటీసు అందచేస్తే.. అది చెల్లదని ఆయన తరఫు న్యాయవాది కోటేశ్వరరావు వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాలేవీ నోటీసులో పేర్కొన లేదన్నారు. కేవలం విజయ్ను.. అతని కుటుంబ సభ్యులను భయపెట్టేందుకే నోటీసులు ఇచ్చినట్టు కన్పిస్తోందని అన్నారు. విజయ్ తరఫు న్యాయవాదులుగా తాము సీఐడీ కార్యాలయానికి వెళ్లినా పోలీసులు మమ్మల్ని పట్టించుకోలేదని తెలిపారు. నాలుగు గంటల పాటు సీఐడీ కార్యాలయంలో వేచి చూసినా స్పందించలేదని తెలిపారు.
అసలు లేఖలో ఏముందంటే : ఎఫ్ఐఆర్ కాపీ, నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని విజయ్ లేఖలో కోరారు. తన నివాసంలోకి అక్రమంగా ఏపీ సీఐడీ పోలీసులు ప్రవేశించారని ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్‌ను కొట్టారని, తన పిల్లల్ని సంరక్షించే వారిపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: