ETV Bharat / city

'అప్పుడు వాయిదా అంటే తిట్టారు.. నేడు నిర్వహిస్తామంటే తప్పంటున్నారు' - బులుగు బ్యాచ్ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్న ప్రతిసారీ వైకాపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని తెదేపా నేతలు విమర్శించారు. మార్చిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఎన్నికలు వాయిదా వేస్తే.. ఎన్నికలు పెట్టాల్సిందే అంటూ గింజుకున్న బులుగు బ్యాచ్.. నేడు ఎన్నికలు పెడతామంటే వద్దంటూ అరవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏపీ ఎన్జీవోలు ఏ హక్కుతో ఎన్నికలకు సహకరించమని చెబుతున్నారో స్పష్టం చేయాలని నేతలు నిలదీశారు.

'అప్పుడు వాయిదా అంటే తిట్టారు.. నేడు నిర్వహిస్తామంటే తప్పంటున్నారు'

author img

By

Published : Jan 9, 2021, 2:23 PM IST

Updated : Jan 9, 2021, 11:03 PM IST

దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్నామంటూ జబ్బలు చరుచుకుంటున్న వైకాపా నేతలు.. స్థానిక సంస్థల పేరుతో ప్రజాభిప్రాయం తీసుకుందామంటే పంచెలు తడుపుకుంటున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఎద్దేవా చేశారు. మార్చిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఎన్నికలు వాయిదా వేస్తే.. ఎన్నికలు పెట్టాల్సిందే అంటూ గింజుకున్న బులుగు బ్యాచ్.. నేడు ఎన్నికలు పెడతామంటే వద్దంటూ అరవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

tdp leader bandaru
బండారు పత్రికా ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్న ప్రతిసారి బులుగు బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని విమర్శించారు. అండగా ఉన్నారని భావించిన ప్రజలు చెప్పులతో కొట్టి కనీసం ప్రచారానికి కూడా రానీయకుండా చేస్తారనే భయం వైకాపా నేతల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వ దోపిడీ, దుర్మార్గాలు, అవినీతి, చేతకాని పరిపాలన, పనికిమాలిన పథకాలపై ప్రజల్లో స్పష్టత వచ్చిందని స్పష్టం చేశారు. బులుగు బ్యాచ్ గుడ్డల్ని ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊడగొట్టడం ఖాయమని వారి మాటల్లోనే తెలుస్తోందన్న బండారు ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకుని.. ఎన్నికలకు సహకరించాలని సూచించారు.

ఓటమి భయంతోనే ఎన్నికలు వద్దంటున్నారు..

ఎన్నికల నిర్వహణను తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్వాగతించారు. ఎన్నికలపై సీఎం జగన్ న్యాయస్థానాలను ఆశ్రయిస్తే...బయపడినట్లేనని ఎద్దేవా చేశారు. కొవిడ్ వచ్చిన తరువాత బిహార్​తో సహా అనేకచోట్ల ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. వైకాపా ఓటమి భయంతోనే ఎన్నికలను వ్యతిరేకిస్తోందని విమర్శించారు.

ప్రజాబలం ఉండగా..భయమెందుకు ?

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు షేక్ అయ్యాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కళావెంకట్రావ్‌ వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ నేతల్లా మాట్లాడటం హేయమని విమర్శించారు. ఉద్యోగుల సంక్షేమం గురించి ఏనాడు మాట్లాడని ఉద్యోగుల సంఘం నేడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాబలం మెండుగా ఉందని చెప్పుకునే జగన్..ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వ తీరు

ఎన్నికలు వద్దని చెబుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏ రాష్ట్రంలోనూ చూడలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు. ఏపీ ఎన్జీవోలు ఏ హక్కుతో ఎన్నికలకు సహకరించమని చెబుతున్నారో స్పష్టం చేయాలని నిలదీశారు. ఒక వ్యక్తిపై కోపంతో పాలకులు ఎందుకంత పట్టుదలకు పోతున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వతీరు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విఘాతం కలిగించేదిగా ఉందని విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సహా, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. పాత నోటిఫికేషన్ రద్దుచేసి...కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల కమిషన్​ను ఆలపాటి విజ్ఞప్తి చేశారు.

జగన్ వ్యవహారం ప్రజలకు తెలిసిపోయింది

నేరప్రవృతి నుంచి అధికారంలోకి వచ్చిన జగన్...ఏ వ్యక్తైనా,వ్యవస్థైనా తాను చెప్పినట్లే వినాలనుకుంటున్నాడని తెదేపా అధికార ప్రతినిది పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో తాము ఎన్నికలకు వెళ్లమని మంత్రులు కొడాలి, పెద్దిరెడ్డి అన్నప్పుడే ముఖ్యమంత్రి వ్యవహారం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గతంలో ఎన్నికలు వాయిదా వేశాడన్న అక్కసుతో నిమ్మగడ్డకు కులాన్ని ఆపాదించి దూషించారని మండిపడ్డారు.

రాజ్యాంగ వ్యవస్థలపైనే ఎదురు దాడా?

అవినీతిపై ప్రజల తిరుగుబాటును గుర్తించిన ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలపైనే ఎదురుదాడికి దిగటం గర్హనీయమని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యనించారు. రాజ్యాంగ వ్యవస్థలపై దూషణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్​ను రద్దు చేసి.., కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్​ఈసీని కోరారు. స్థానిక ఎన్నికలపై ఎస్​ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

సీఎం సొంత జిల్లాలో దేవాలయాలపై దాడులా ?

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దేవాలయాలపై దాడులు జరుగుతుండటం బాధాకరమని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు వ్యాఖ్యనించారు. శాంతిభద్రతలు సహా రాష్ట్రాన్ని ఎన్టీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే..జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా అరాచకపాలన సాగిస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:

చెల్లెలి అప్పగింతలు పూర్తి చేశాడు... తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు...

Last Updated : Jan 9, 2021, 11:03 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.