భాజపాతో ఏపీలో డ్రామా, పుదుచ్చేరిలో ప్రేమ అంటే కుదరదని పేర్ని నాని గ్రహించాలని.. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. పుదుచ్చేరికి హోదా ప్రకటించిన భాజపాపై విమర్శలు చేస్తున్న వైకాపా.. భాజపా మిత్రపక్షాలను గెలిపించాలంటూ యానాంలో ఎందుకు ప్రచారం చేస్తోందని ప్రశ్నించారు. పేర్ని నానికి చిత్తశుద్ధి ఉంటే.. నేరుగా జగన్‌ను నిలదీయాలని సూచించారు.
తిరుపతి ఉపఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తున్నందున.. ఎన్టీఆర్ కుమార్తె, నాదెండ్ల కుమారుడు కలిసి పనిచేయడంపై పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు చేశారు. ఎన్టీఆర్, నాదెండ్ల ఉప్పు, నిప్పుగా ఉండేవారని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన సచిన్ తెందూల్కర్