ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సఫలీకృతమయ్యారని మాజీ మంత్రి ఆనందబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రాజధానిగా అమరావతి ఉండాలన్న జగన్.. గెలిచాక ఎందుకు తన వైఖరి మార్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో వైకాపా నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. ఆ పార్టీ నేతల తీరును వ్యతిరేకించిన నిజాయితీపరుడైన అధికారిని బదిలీ చేశారని అన్నారు.
గుంటూరు తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే గిరిధర్, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. రాజధానిపై వేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వకముందే సీఎం ప్రకటన చేయడం అనుమానాలకు తావిస్తోందని గల్లా జయదేవ్ అన్నారు. రాజధాని మూడు ముక్కలు చేయడం దక్షిణాఫ్రికాలో తప్ప ఇంకెక్కడా చూడలేదని చెప్పారు. సీఎం జగన్.. ఆంగ్లేయుల మాదిరి విభజించు - పాలించు విధానాన్ని అనుసరిస్తున్నారని ఎమ్మెల్యే గిరిధర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: