ETV Bharat / city

నెల్లూరులో దంపతుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్న తెదేపా - TDP Respond on Nellore murders

TDP Respond on Nellore murders నెల్లూరులో తెదేపా సోషల్ మీడియా కార్యకర్త సునీత, కృష్ణారావు హత్యలపై అన్ని కోణాల్లో విచారణ చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్​ ట్విట్టర్​ ద్వారా డిమాండ్ చేశారు.

TDP social media activist killed in Nellore
తెదేపా సోషల్ మీడియా కార్యకర్త హత్యపై స్పందిచిన చంద్రబాబు
author img

By

Published : Aug 29, 2022, 3:22 PM IST

Chandrababu response on Couple Murder: నెల్లూరులో కృష్ణారావు, సునీత హత్యలు జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందేహం వ్యక్తం చేశారు. సునీత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కావున అధికారులు ఆ కోణంలో కూడా విచారించాలని సూచించారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దంపతుల దారుణ హత్యలు విచారకరమని, ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఘాటుగా స్పందించారు.

Lokesh response on Couple Murder: వైకాపా పాలనలో నెల్లూరు నేరాలకు అడ్డాగా మారిపోయిందని లోకేశ్​ మండిపడ్డారు. రోజుకో ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కొంతమంది పోలీసులు వైకాపా నాయకుల రాజకీయ వికృత క్రీడలో భాగస్వామ్యం కావడం వలనే తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. నెల్లూరులో దుండగులు అత్యంత కిరాతకంగా దంపతులు కృష్ణారావు, సునీతలను హత్య చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి హంతకులు.. వారి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్​ డిమాండ్ చేశారు.

  • నెల్లూరులో కృష్ణారావు, సునీత దంపతుల దారుణ హత్యలు విచారకరం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. హత్యలు జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉంది.
    సునీత గారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త. అధికారులు ఈ కోణంలో కూడా విచారించి, హత్యలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. pic.twitter.com/5KFKBLewOh

    — N Chandrababu Naidu (@ncbn) August 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.