ETV Bharat / city

ఈ ప్రభుత్వం రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించాలి: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దగా దినోత్సవాన్ని నిర్వహిస్తే బాగుంటుందని.. పార్టీ సీనియర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు.

tdp chief chandrababu
tdp chief chandrababu
author img

By

Published : Jul 8, 2020, 4:07 PM IST

వైకాపా జరపాల్సింది రైతు దగా దినోత్సవమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో అన్నదాత సుఖీభవ పేరిట అమలైన పథకాన్ని రద్దు చేసి.. రైతుభరోసాను తెచ్చారని అన్నారు. పార్టీ సీనియర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ విషయంపై మాట్లాడారు.

ఒక్కో రైతుకు 5ఏళ్లలో రూ. 80వేలు నష్టం చేశారని ఆరోపించారు. రైతు భరోసా’ పేరుతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైకాపా ప్రభుత్వం ఇచ్చేది రూ. 37, 500 మాత్రమేనని వివరించారు. అదే తెదేపా ప్రభుత్వం వచ్చి ఉంటే ఒక్కో రైతుకు రూ లక్షా 20 వేలు ఇచ్చేదని చంద్రబాబు చెప్పారు.

'రైతు దినోత్సవమంటే.. నిధులు ఎగ్గొట్టడమేనా..?'

10 లక్షల మంది రైతులకు భరోసాను ఎగ్గొట్టారని ఆరోపించిన తెదేపా అధినేత.. సున్నా వడ్డీ పథకానికి 1,100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి.. రూ. 100 కోట్లే ఖర్చు చేశారని.. రూ.7 వేల కోట్ల రుణమాఫీని ఎగ్గొట్టారని చెప్పారు. రైతు దినోత్సవం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రైతుల్లో కులాల పేరుతో చీలిక తెచ్చారని.. 13 లక్షల కౌలు రైతులకు భరోసా సాయాన్ని ఎగ్గొట్టారని చంద్రబాబు ఆగ్రహించారు. రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ప్రాణాలు తీశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అక్కసు వస్తుందనే భయంతోనే...

వ్యవసాయ బడ్జెట్ లో 35శాతం మాత్రమే ఖర్చు పెట్టిన వైకాపా ప్రభుత్వానికి.. రైతు దినోత్సవం జరిపే హక్కు ఎక్కడుందని చంద్రబాబు నిలదీశారు. 65 శాతం బడ్జెట్ రైతులకు ఖర్చు చేయలేక పోవడం చేతగానితనమన్నారు. వ్యవసాయానికి 10శాతం బడ్జెట్ పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఐదేళ్లలో వ్యవసాయానికి 90వేల కోట్ల రూపాయల నిధులతో రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు.

అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం అభివృద్ది చేస్తే తెదేపాకి పేరు వస్తుందనే అక్కసుతో పనులు నిలిపేయడం దళిత ద్రోహమన్నారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం మంచిదే అని.. అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం కూడా 26 ఎకరాల్లో అభివృద్ది చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహంతో పాటుగా జగ్జీవన్ రామ్ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్నారు.

ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి

ఇళ్ల స్థలాల పేరుతో 3వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఎకరం అభివృద్దికి 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఖర్చు పెట్టి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వివిధ పనులపై పెట్టాల్సిన నరేగా నిధులన్నీ కేవలం మెరక వేయడానికే ఖర్చు పెట్టి నిబంధనలకు తూట్లు పొడిచారని విమర్శించారు. గత ఏడాదిగా నరేగా పనుల్లో గ్రామాల్లో పెద్దఎత్తున దోపిడి జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. వీటన్నింటిపై నిఘా పెట్టి వైకాపా అవినీతి అక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.