ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 2018లో తెదేపా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రెండు రూపాయల చొప్పున వ్యాట్‌ను తగ్గించిందని గుర్తు చేశారు. తక్షణమే డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు కేంద్రంపై సీఎం జగన్ ఒత్తిడి తేవాలన్నారు.
కరోనా కాలంలో ప్రజలు, వ్యాపారులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ధరలు పెంచటం సరికాదన్నారు. గత 15 రోజుల్లో డీజిల్ రూ. 8.88, పెట్రోల్ 7.97 రూపాయలు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా పెట్రోల్‌పై 2.76 రూపాయలు, డీజిల్‌పై రూ.3.07 వ్యాట్ భారం వేసి ప్రజలపై భారం మోపిందని ధ్వజమెత్తారు. ధరల పెంపుతో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి దెబ్బతింటుందని చెప్పారు.
ఇదీ చదవండి: