కరోనా కేసులు దాచిపెడితే దావానలంలా వ్యాపిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరులో వైద్యులు ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. రక్షణ ఉపకరణాలు లేకే వైద్యులు చనిపోయారని, తక్షణమే వారికి రక్షణ ఉపకరణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు ఎప్పుడూ ముందు చూపు ఉండాలన్నారు. తెలుగుదేశం నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. పేదలకు అండగా నిత్యావసరాల పంపిణీని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కూరగాయలు, గుడ్లు, బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. అభివృద్ధిని కొనసాగిస్తే జాతికి ప్రయోజనమని, నాశనం చేస్తే జాతి క్షమించదని హెచ్చరించారు. కరోనా కట్టడిపై అన్నిపార్టీలతో మాట్లాడి ప్రధాని మోదీ జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం తెచ్చారని చంద్రబాబు కొనియాడారు.
కరోనాను దాచిపెడితే దావానలంలా వ్యాపిస్తుంది: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
తెదేపా నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు అండగా నిత్యావసరాల పంపిణీని కొనసాగించాలని సూచించారు. మన రాష్ట్రంలో వైకాపా నేతలు ఇష్టానుసారం చేస్తున్నారని... ఒక పద్ధతి లేకుండా చేస్తున్నారన్నారు. కరోనా పరీక్షలపై అబద్ధాలు చెబుతున్నారని.. అందువల్లే రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోందన్నారు.
కరోనా కేసులు దాచిపెడితే దావానలంలా వ్యాపిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరులో వైద్యులు ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. రక్షణ ఉపకరణాలు లేకే వైద్యులు చనిపోయారని, తక్షణమే వారికి రక్షణ ఉపకరణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు ఎప్పుడూ ముందు చూపు ఉండాలన్నారు. తెలుగుదేశం నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. పేదలకు అండగా నిత్యావసరాల పంపిణీని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కూరగాయలు, గుడ్లు, బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. అభివృద్ధిని కొనసాగిస్తే జాతికి ప్రయోజనమని, నాశనం చేస్తే జాతి క్షమించదని హెచ్చరించారు. కరోనా కట్టడిపై అన్నిపార్టీలతో మాట్లాడి ప్రధాని మోదీ జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం తెచ్చారని చంద్రబాబు కొనియాడారు.
ఇవీ చూడండి-'ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉండటం సమంజసం కాదు'