తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. అక్కడ ఆమె కొండ చిలువను పట్టుకున్నారు. కొండ చిలువను పట్టుకోవడం థ్రిలింగ్‌గా, ప్రత్యేకంగా ఉందని గవర్నర్ ట్వీట్ చేశారు.
![governor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11279649_dg.jpg)
కొండ చిలువను పట్టుకున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అర్బన్ ఫారెస్ట్ సందర్శించడం ఓ ప్రత్యేక అనుభూతిలా అనిపించిందని తెలిపారు. అధికారులు పర్యటకులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్ల చెప్పారు.
ఇదీ చదవండి: 8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు