ETV Bharat / city

ఆలయాల్లో దాడులపై జీవీఆర్ శాస్త్రి విమర్శలు.. జగన్​పై తీవ్ర వ్యాఖ్యలు - Hindu Maha Sabha news

ఏపీలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై దాడులు గురించి అఖిల భారతహిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్, హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌ శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.

Hindu Maha Sabha
స్వామి చక్రపాణి మహరాజ్, జీవీఆర్‌ శాస్త్రి
author img

By

Published : Jan 4, 2021, 1:14 PM IST

Updated : Jan 4, 2021, 2:00 PM IST

స్వామి చక్రపాణి మహరాజ్, జీవీఆర్‌ శాస్త్రి

పాకిస్థాన్​లో హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై దాడులు ఎలా చేస్తున్నారో.... అదే తరహాలో ఆంధ్రప్రదేశ్​లో దాడులు జరుగుతున్నాయని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ విమర్శించారు. ఒకవైపు అమరావతి రాజధానిని నాశనం చేస్తూ.. రైతులకు అన్యాయం చేస్తూనే.. మరోవైపు హిందూ దేవాలయాలపై దాడులు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాంమందిర్​ని నాశనం చేసిన వారికి ఏ గతి పట్టిందో సీఎం జగన్ మోహన్ రెడ్డికీ అదే గతి పడుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు తీరు ప్రశంసనీయం: స్వామి చక్రపాణి మహారాజ్

రాష్ట్రంలో ఎక్కడెక్కడ దేవాలయాలపై, దేవతామూర్తులపై దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేశారో అక్కడ వెయ్యి కోట్లతో అన్నింటినీ పునః ప్రతిష్ట చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆరెస్సెస్, వీహెచ్​పీ, భాజపాలు మౌనం వహించిన తీరు నిరాశ కలిగించిందన్నారు. రామతీర్థం విషయంలో చంద్రబాబు స్పందించిన తీరు ప్రశంసనీయమని కొనియాడారు. కరోనా కారణంగా అక్కడ పర్యటించలేకపోతున్నామని.. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఏపీలో పర్యటిస్తామన్నారు.

ఏం జరిగినా ప్రభుత్వానిదే భాద్యత: జీవీఆర్‌ శాస్త్రి

ప్రధాని మోదీ వంటి వ్యక్తులు గౌరవించే అశోక్​గజపతి రాజును అవమానించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హిందూమహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి విమర్శించారు. అక్కడ ఏం జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని.. ఘటన జరిగిన ప్రతి దేవాలయాన్ని ప్రభుత్వమే అభివృద్ధిపరచాలని శాస్త్రి డిమాండ్ చేశారు. ఇకపై ఒక్క దేవాలయంపై దాడి జరిగినా ఊరుకునేది లేదని జీవీఆర్ హెచ్చరించారు.

అమరావతిలో వేంకటేశ్వరస్వామి మందిర నిర్మాణం ఎందుకు ఆపారు?

తితిదే డబ్బుతో సర్కారుకు సంబందం లేని వ్యవహారమని.. అమరావతిలో నిర్మాణంలో ఉన్న వేంకటేశ్వరస్వామి మందిర నిర్మాణం ఎందుకు ఆపారని జీవీఆర్ శాస్త్రి ప్రశ్నించారు. లంకాధిపతి రావణుడికి ఏ గతి పట్టిందో.. అదే గతి జగన్మోహన్ రెడ్డికి పడుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రభుత్వమే ఈ ఆలయాలను అభివృద్ధిపరిచేలా సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. దేవాలయాల పట్ల సీఎం పక్షపాతపూరిత ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని... దాడులు జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారని జీవీఆర్ శాస్త్రి ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రామతీర్థంలో కోదండ రామాలయం పునర్నిర్మాణం!

Last Updated : Jan 4, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.