ETV Bharat / city

కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను.. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ అనంతరం ఈటల

Etela Rajender on CM KCR: తెలంగాణ శాసనసభ సమావేశాల నుంచి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సస్పెండ్‌ అయ్యారు. సభ ప్రారంభం అవగానే, నిన్న సభాపతిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది. దీనిపై ఈటల అభ్యంతరం వ్యక్తం చేయడంతో..సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. తన సస్పెండ్​పై తీవ్రంగా స్పందించిన ఈటల ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారని.. కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

etela
etela
author img

By

Published : Sep 13, 2022, 4:15 PM IST

Etela Rajender on CM KCR: శాసనసభ సమావేశాల నుంచి ఈటల రాజేందర్‌ సస్పెండ్‌ అయ్యారు. సభ ప్రారంభమవ్వగానే... చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఈటల రాజేందర్ అంశాన్ని లేవనెత్తారు. సభాపతిపై చేసిన వ్యాఖ్యలపై ఈటల... బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్‌ సభలో ఉండి చర్చ సాగించాలని మేము కోరుకుంటున్నామన్నారు. దీనిపై ఈటల అభ్యంతరం వ్యక్తం చేయడంతో... సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు.

అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం పోలీసు వాహనంలో తనను బలవంతంగా తీసుకెళ్లడంపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండై సభ నుంచి బయటకు వెళ్లిన ఈటల తొలుత మీడియా పాయింట్‌కు వెళ్లేందుకు యత్నించారు. కానీ అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో... ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సొంత వాహనం కోసం వేచి చూస్తుండగా... ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుంచి తరలించారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై మండిపడ్డారు.

‘‘మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారు.. ఏడాది కాలంగా నాపై కుట్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’’ అని ఈటల అన్నారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.