తెలంగాణలో జరుగుతున్న మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయింది. ఈ ఉత్కంఠ పోరులో తెరాస అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన వాణీదేవి.. భాజపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన రామచంద్రరావుపై 11వేల 703 ఓట్లతో ఓట్లతో గెలుపొందారు. వాణీదేవి గెలుపుతో తెలంగాణ భవన్లో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందంలో మునిగిపోయారు.
బుధవారం ఓట్లలెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వాణిదేవియే ఆధిక్యంలో కొనసాగింది. వాణీదేవికి తొలి ప్రాధాన్యతలో లక్షా 12వేల 689, రెండో ప్రాధాన్యతలో 36వేల 580 ఓట్లు వచ్చాయి. మొత్తంగా లక్షా 49 వేల 269 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి రామచంద్రరావు మొదటి ప్రాధాన్యతలో లక్షా 4వేల 668ఓట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లలో 32వేల898 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రామచంద్రరావు లక్షా 37వేల 566 ఓట్లు పోలయ్యాయి. రెండో ప్రాధాన్యత లెక్కింపులో ప్రొ.నాగేశ్వర్ నుంచి తెరాసకు 21వేల 259 ఓట్లు రాగా.. భాజపాకు 18వేల 368 ఓట్లు వచ్చాయి.
ఇదీ చదవండి: