ETV Bharat / city

ఎన్నికల వాయిదాను ఆపలేం.. ఎస్ఈసీదే తుది నిర్ణయం: సుప్రీంకోర్టు - రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం వార్తలు

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానికే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా ఎన్నికల నియమావళిని ఎత్తేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కొత్తగా ఉచిత పథకాలు ప్రవేశపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ec-sc court
ec-sc court
author img

By

Published : Mar 19, 2020, 3:07 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం: సుప్రీంకోర్టు

స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమను సంప్రదించకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొందని, ఆయా ఉత్తర్వులు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్ నాదకర్ని, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే వాదనలు వినిపించారు. ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రందించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేసిందని నాదకర్ణి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న వాయిదా నిర్ణయం జోలికి వెళ్లబోమని సీజేఐ జస్టిస్‌ బొబ్డే స్పష్టం చేశారు.

ఎన్నికల నియమావళి కారణంగా పాలనకు ఇబ్బందికరమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ తేదీ తెలీకుండా ఎస్ఈసీ ఎన్నాళ్లు ఎన్నికల నియమావళి అమలులో ఉంచుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించేందుకు ఎన్నికల సంఘం రాజకీయ కోణంలో వెళ్లిందని వాదించారు. ఎన్నికల నియమావళిని 6 వారాల పాటు ఎలా కొనసాగిస్తారని న్యాయమూర్తులు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల వేళ 4 నెలల పాటు కోడ్ అమల్లో ఉందని ఎస్ఈసీ తరపు న్యాయవాది శేఖర్ మాఫడే వివరించారు. ఎన్నికల ప్రక్రియ వాయిదా మాత్రమే వేశామని, పూర్తిస్థాయిలో రద్దు చేయనందున కోడ్ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తదుపరి ప్రక్రియ సైతం పారదర్శకంగా నిర్వహించేందుకే ఎన్నికల నియమావళిని కొనసాగిస్తున్నామన్నారు.

కరోనా ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతున్నందున కోడ్ పొడిగింపుతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. కోడ్‌ను ఎందుకు ఎత్తివేయకూడదని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించగా.. కొత్తగా ఉచిత పథకాలు తీసుకొస్తే ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల వరకు కొత్తగా ఉచిత పథకాలు తీసుకురాకుండా ఆదేశాలిస్తామన్న సీజేఐ ధర్మాసనం... ఎన్నికల నియామళిని ఎత్తివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 6 వారాల తర్వాత కరోనా ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది. విధానపరమైన నిర్ణయాలను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తీసుకోవద్దని.. కొత్తగా ఉచిత పథకాలు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానికే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల తేదీలు ఖరారు చేసి, అప్పటి నుంచి మళ్లీ కోడ్ అమల్లోకి తేవాలని ఎస్ఈసీకి సూచించింది. ఇంతటితో ఈ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

ఇవీ చదవండి: కౌలాలంపూర్​ నుంచి విశాఖ చేరుకున్న భారతీయ విద్యార్థులు

For All Latest Updates

TAGGED:

ec-sc court
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.