ETV Bharat / city

గాలి బెయిల్ షరతులపై విచారణ.. ఆరు వారాలకు వాయిదా - cbi cases in galli janardhan reddy

బెయిల్ షరతులపై మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్​పై సమాధానం ఇచ్చేందుకు జనార్ధన్​రెడ్డి తరపు న్యాయవాది సమయం కోరారు. అంగీకరించిన కోర్టు... విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

supreme court
supreme court
author img

By

Published : Jan 5, 2021, 8:50 PM IST

తన బెయిల్ షరతులను సడలించాలంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్​రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. మంగళవారం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్యం ధర్మాసనం.. గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్​ను విచారించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్​పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని గాలి జనార్ధన్​రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. అందుకు అంగీకరించిన జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం... రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

పక్కా ప్రణాళికతోనే రామతీర్థం ఆలయంపై దాడి: సీఐడీ అదనపు డీజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.