అమరావతి బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్)కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అరుణ్‌మిశ్ర, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ఆత్మారాం నడ్కర్ణి, ఎస్ నిరంజన్‌రెడ్డి, న్యాయవాది నజ్కీలు వాదనలు వినిపించారు.
మాస్టర్ ప్లాన్‌తో ముడిపడి ఇతర పిటిషన్లు కూడా ఉన్నాయని వాటన్నింటినీ కలిపి విచారించాలని లిఖితపూర్వకంగా కోరారు. అమరావతి రైతులకు కేటాయించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించి జారీ చేసిన జీవోపై కూడా హైకోర్టు స్టే ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీన్ని కూడా జత చేయాలని సాల్వే కోరగా.. అనుమతించిన ధర్మాసనం పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామంది.
ఇదీ చూడండి..