తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీబీపేట్ పాఠశాలపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu twitter) స్పందించారు. ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ గురించి తెలుసుకున్న ఆయన... శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానని ట్వీట్ చేశారు. బీబీపేట్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సుభాష్‌రెడ్డి వంటి వాళ్లు సమాజానికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవం ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. మహేశ్‌బాబు దీనిపై రెస్పాండ్ అయ్యారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలకేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాలను(KTR in School Inauguration) ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంత గొప్పగా పాఠశాల నిర్మించడం హర్షించదగ్గ విషయమని ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. సొంత ఊరి రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదన్నారు. పాఠశాల నిర్మాణం కోసం రూ.6.5 కోట్లు వెచ్చించిన వ్యాపారవేత్తను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారి నానమ్మ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొత్త హంగులతో నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.
కార్పొరేట్‌ను తలదన్నేలా బీబీపేట్ జడ్పీ ఉన్నత పాఠశాల భవనం నిర్మాణం జరిగింది. రూ.6 కోట్లతో ఆధునిక హంగులతో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టారు. 42 వేల చదరపు అడుగుల్లో 32 సువిశాల గదుల్లో డిజిటల్ తరగతులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు చేశారు. గ్రంథాలయం, మూత్రశాలలు, నీటి శుద్ధి కేంద్రం, భోజనశాల, ఆట వస్తువులు, ఉపాధ్యాయులకు విశ్రాంత గదులను ఏర్పాటు చేశారు.
-
Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనగామలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరిగిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక మౌలిక అంశాలను పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెచ్చే విధంగా రాష్ట్రంలో ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇస్తున్నామని అన్నారు. విద్యా, వైద్యంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడం సీఎం లక్ష్యమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గోవర్దన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జీతేశ్ వి.పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ ఛైర్మన్ శోభ హాజరయ్యారు.
ఇంత గొప్పగా ఉంటుందని నేను అనుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ పాఠశాల అందంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మా నియోజకవర్గాల్లో చేపడుతాం. మీ సేవలకు అభినందనలు. సుభాష్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని.. అందరూ ముందుకు రావాలని సూచిస్తున్నాను. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో... సుభాష్‌రెడ్డి లాంటి వాళ్లు తోడైతే.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.
-కేటీ రామారావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి
ఇదీ చదవండి